Telangana : బీజేపీలో చేరిన ఏపీ మాజీ డీజీపీ జయచంద్ర
బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని మోదీ విధానాలు నచ్చి రిటైర్డ్ డీజీపి ఎస్.కె.జయచంద్ర, వారి కూతురు పాయల్ నేహాలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నా.నిస్వార్థంగా పనిచేసే రిటైర్డ్ అధికారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది.

Former AP DGP Jayachandra joined BJP
Telangana BJP : ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జయచంద్ర తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. జయచంద్రతో పాటు ఆయన కుమార్తె పాయల్ నేహా కూడా బీజేపీలో చేరారు. వీరికి బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతు..బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని మోదీ విధానాలు నచ్చి రిటైర్డ్ డీజీపి ఎస్.కె.జయచంద్ర, వారి కూతురు పాయల్ నేహాలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. నిస్వార్థంగా పనిచేసే రిటైర్డ్ అధికారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో కూడా చాలా మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే మేధావి వర్గం బీజేపీలో చేరాలని కోరుతున్నానని బండి సంజయ్ ఆకాంక్షించారు.
సీఎంఓలో కొంతమంది తీరు కేసీఆర్ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ అయిన 500 మంది అధికారులను అడ్డుపెట్టుకుని ఏటా వెయ్యి కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారు అంటూ ఆరోపించారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దీనికి కారణం ప్రభుత్వ విధానాలేనని అన్నారు. ఈ చివరి ఘడియల్లోనైనా అధికారులు ఆలోచన మార్చుకోని తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేయాలని కోరుతున్నాను అంటూ బండి సంజయ్ సూచించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ @bandisanjay_bjp గారి సమక్షంలో బిజెపిలో చేరిన రిటైర్డ్ డీజీపీ ఎస్.కె.జయచంద్ర, ఆయన కుమార్తె పాయల్ నేహా. pic.twitter.com/uk0qoN1cjN
— BJP Telangana (@BJP4Telangana) June 29, 2023