నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఏం జరగనుంది..! బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ..

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.

నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఏం జరగనుంది..! బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ..

KTR

Updated On : June 16, 2025 / 8:28 AM IST

KTR Formula-E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వటంతో కేటీఆర్ విచారణకు వెళ్లనున్నారు.

Also Read: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీపై శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు.. వారి కెప్టెన్సీలో ఆడిన సమయంలో..

వాస్తవానికి మే28వ తేదీన విచారణకు హాజరు కావాలని మే26వ తేదీన కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ ఏసీబీని కోరారు. దీంతో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరు కానున్నారు.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 54. 89 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ ను ఏసీబీ నమోదు చేసుకుంది. ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ.. వారి స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండీ చమలశెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులు సీఈవోలను ఏసీబీ ఇప్పటికే వర్చువల్ గా విచారించింది.

కేటీఆర్ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయనుంది. విచారణ నేపథ్యంలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయంకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.