Formula E Car Race Case : విచారణకు రండి.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ, ఈడీ నోటీసులు
కేటీఆర్ సహా పలువురు అధికారులపై కేసు పెట్టింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది.

Formula E Car Racing Case
Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు పెంచాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ, ఈడీ ప్రశ్నించనున్నాయి. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ, 8న విచారిస్తామని ఈడీ నోటీసులు జారీ చేశాయి. అయితే, ఏసీబీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? లేదా ? అన్నది సస్పెన్స్ గా మారింది.
ఒకేసారి రంగంలోకి ఏసీబీ ఈడీ..
ఒకేసారి ఏసీబీ, ఈడీ రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కార్ రేసింగ్ నిర్వహణకు చెల్లించిన నిధుల విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ సహా పలువురు అధికారులపై కేసు పెట్టింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది.
ఏసీబీ, ఈడీ విచారణలకు కేటీఆర్ హాజరవుతారా?
మరోవైపు కేటీఆర్ మాత్రం ఎక్కడా అవినీతి జరగలేదని చెబుతున్నారు. ఏసీబీ విచారణను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కోర్టులో సవాల్ చేశారు కేటీఆర్. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు 7న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ విచారణలకు కేటీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ఆ అనుభవం కాంగ్రెస్‌కు ఉంది.. ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష ఇదే: పొన్నం ప్రభాకర్
విచారణలకు కేటీఆర్ గడువు కోరే అవకాశం..
ఈ వ్యవహారంపై పార్టీ లీగల్ సెల్ తో కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్వాష్ పిటిషన్ పై కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండటంతో విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీని గడువు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈడీ విచారణకు కూడా హాజరయ్యే విషయంలో దాదాపు ఇదే అభిప్రాయంతో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయవాదుల సూచనలకు అనుగుణంగానే కేటీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని గులాబీ పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు బీఎల్ఎన్ రెడ్డి గడువు కోరారు.
లీగల్ టీమ్ తో కేటీఆర్ చర్చలు..!
కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధుల చెల్లింపు వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్ ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ విచారణకు ముందే కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసు ఫైల్ చేయడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఏసీబీ విచారణ చేయొచ్చు కానీ తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయరాదనే ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో విచారణకు రావాలని మరోసారి కేటీఆర్ కు సమన్లు ఇచ్చింది ఏసీబీ.
మరి కేసీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. కేటీఆర్ తన లీగల్ టీమ్ తో దీనిపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏసీబీ విచారణకు హాజరైతే పరిస్థితి ఏంటి? హాజరుకాకపోతే పరిస్థితి ఏంటి? అన్నదానిపై కేటీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ.. అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనం కూల్చివేత..