కరోనా కట్టడికి స్పెషల్ ఆఫీసర్లు నియామకం…జీహెచ్ఎంసీ సరికొత్త ప్లాన్

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. కేసులు అధికంగా ఉన్న ఒక్కో సర్కిల్ ను ఒక్కో అధికారికి అప్పగించింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. ప్రధానంగా కొన్ని జోన్లు ఖైరతాబాద్, చార్మినార్ తోపాటు సికింద్రాబాద్ ప్రాంతాల్లో చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే గత కొద్ది కాలంగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి ప్రాంతాల్లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రధానమైన సర్కిళ్లు ఏవైతే ఉంటాయో ఆ సర్కిళ్లకు ముఖ్యమైన అధికారులను నియమించారు.
ప్రధానంగా జీహెచ్ఎంసీలో పని చేస్తున్న అడిషనల్ కమిషనర్లు ఐఏఎస్ లుగా ఉన్నారు. వీరిలో ముగ్గురు ఐఏఎస్ లు, సీనియర్ అధికారులను, అడిషనల్ కమిషనర్లుగా పని చేస్తున్న సీరియర్ అధికారులను వివిధ ప్రాంతాల్లో నియమించారు. వారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ ఏ విధంగా ఉంది? వైరస్ కట్టడికి జీహెచ్ఎంసీ ఇప్పటికే కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసే పనిలో ఉంది. కాబట్టి కంటైన్ మెంట్ జోన్ల ఏర్పాటు ఏ విధంగా ఉంది? అక్కడ వారికి సేవలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇంకా ఏమైనా ల్యాప్స్ ఉన్నాయా? వాటిని ఏ విధంగా ఫుల్ పిల్ చేయాలన్న అంశాలను వీరు పరిశీలిస్తారు.
ప్రధానంగా ఖైరతాబాద్ జోన్ కు సంబంధించి మెహిదీపట్నం సర్కిల్ కు శంకరయ్య, కార్వాన్ సర్కిల్ కు సంధ్య వీరిద్దరూ అడిషనల్ కమిషనర్లుగా ఉన్నారు. వీరిద్దరినీ నియమించారు. అదే విధంగా శేరిలింగంపల్లి జోన్ లోని యూసుఫ్ గూడ సర్కిల్ కు అడిషనల్ కమిషనర్ గా పని చేస్తున్న ఎన్.యాదగిరిరావును నియమించారు. చార్మినార్ జోన్ కు సంబంధించి చంద్రాయన్ గుట్ట, చార్మినార్ తోపాటు రాజేంద్రనగర్ మూడు సర్కిళ్లు చార్మినార్ పరిధిలో ఉన్నాయి. ఇందులో ఇద్దరి ఐఏఎస్ అధికారులను నియమించారు. రాజేంద్ర నగర్ కు సంబంధించి బరాబత్ సంతోష్ ను నియమించారు. చార్మినార్ సర్కిల్ కు సంబంధించి రాహుల్ రాజ్ ఐఏఎస్ ను నియమించారు. చంద్రాయన్ గుట్ట సర్కిల్ కు అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మీని నియమించారు.
ప్రధానంగా అంబర్ పేటకు సంబంధించి సీనియర్ ఆఫీసర్ జయరాజ్ కెనడీ నియమించారు. కుత్బుల్లాపూర్ కు మరో ఐఏఎస్ అధికారి ప్రియాంక అలానీని నియమించారు. ఈ విధంగా ఐఏఎస్ అధికారులు, సీనియర్లు అధికారులు వైరస్ కట్టడి చేయడంతోపాటు నివారణకు తీసుకుంటున్న చర్యల్లో ఎక్కడైనా ల్యాప్స్ ఉంటే అధికారులు చెప్పడం..వారిని మినిట్ మినిట్ అప్రమత్తం చేయనున్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంలో భాగంగా జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.