Ponguleti Srinivasa Reddy : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి- పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. మీరందరూ కలిసి హస్తం గుర్తుకే ఓటు వేయాలి. Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy Campaign : ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ తీసుకొచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అధికారం ఉన్నా లేకున్నా తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నానని తెలిపారు పొంగులేటి.
Also Read : బండి సంజయ్ సంచలన నిర్ణయం? ఇక రాజకీయ సన్యాసం?
కూసుమంచి మండల కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ”పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. మీరందరూ కలిసి హస్తం గుర్తుకే ఓటు వేయాలి. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారు సీఎం కేసీఆర్. జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి దావత్ లు చేసుకుంటున్నారు. వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలి. లేని పక్షంలో రెడ్ హ్యాండెడ్ గా అక్కడే పట్టుకొని సస్పెండ్ చేపిస్తా. రానున్న రోజుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది” అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read : ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?