Mlc Kavitha: అమెరికా నుంచి హైదరాబాద్‌కు కవిత.. ఘనస్వాగతం పలికిన జాగృతి నేతలు, అభిమానులు.. కనిపించని బీఆర్ఎస్ నేతలు..
సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.

Mlc Kavitha: ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి నేతలు, అభిమానులు. జై కవితక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాలేదు.
Also Read: కవిత మరో షర్మిల కాబోతుందా?.. సీఎం రేవంతే ఆ లెటర్ రాయించారేమో.. ఎంపీ రఘునందర్ హాట్ కామెంట్స్
కాగా, తన రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాలని జాగృతి కార్యకర్తలకు సందేశం పంపారు కవిత. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ జనసమీకరణకు కవిత ప్లాన్ చేశారామె. మరోవైపు కవిత లేఖపై బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధానికి దిగాయి. కవిత లేఖ డ్రామా అని బీజేపీ అంటుండగా.. బీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడ్డాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.