Hyderabad: హైదరాబాద్‌లో గ్రేప్ ఫెస్టివల్.. తోటలో తిరుగుతూ.. నచ్చింది టేస్ట్ చేసి బాగుంటే కొనుక్కోవచ్చు.
ద్రాక్ష పంటకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రతీయేటా గ్రేప్ ఫెస్టివల్..

Grape Festival
Grape Festival: ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారు ఉండరు. పుల్లని, తియ్యని ద్రాక్షాలను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినేస్తుంటారు. అయితే, ఈ ద్రాక్ష పండ్లు కావాలంటే మార్కెట్ లోనో.. రోడ్లపై తోపుడు బండ్ల దగ్గరనో కొంటూ ఉంటాం. కానీ, గ్రేప్ ఫెస్టివల్ కు వెళితే తోటంతా కలియతిరిగి మనకు నచ్చినవి తీసుకోవచ్చు.. ఫ్రీగా టేస్ట్ కూడా చేయొచ్చు. నచ్చితే కొనుక్కోవచ్చు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా.. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్లో ద్రాక్ష పరిశోధన కేంద్ర క్షేత్రంలో గ్రేప్ ఫెస్టివల్ ప్రారంభమైంది.
Also Read: Sand Door Delivery: తెలంగాణలో ఇసుక డోర్ డెలివరీ.. ఎలా బుక్ చేసుకోవాలి.. ఎప్పటి నుంచి వస్తుంది..?
ద్రాక్ష పంటకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రతీయేటా కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనంలో గ్రేప్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈసారి ఈ గ్రేప్ ఫెస్టివల్ ను సోమవారం ప్రారంభించారు. అయితే, బుధవారం నుంచి సదర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ ఏడాది దాదాపు 30 రకాల ద్రాక్షా పండ్లను సిద్ధం చేశారు. ద్రాక్షా తోటల్లో కలియ తిరుగుతూ నచ్చిన పండ్లు టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు. అయితే, గ్రేప్ ఫెస్టివల్ లో దొరికే ద్రాక్ష పండ్లు రకాలతో రైతు సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి, ప్రఖ్యాత ద్రాక్ష నిపుణుడు డాక్టర్ ఎస్డీ శిఖామణి, పద్మక్షచింతల వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Also Read: GAMA Awards : గామా అవార్డ్స్ 2025.. 5వ ఎడిషన్ గ్రాండ్ లాంచ్.. అవార్డ్స్ ఈవెంట్ ఎప్పుడంటే..
ద్రాక్ష సాగులో ఎదురవుతున్న సవాళ్లు, యాజమాన్య పద్దతులను చర్చించారు. ద్రాక్ష పంటలో మానవ రహిత ట్రాక్టర్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీడీఏసీతో సంయుక్తంగా జరుగుతున్న పరిశోధన వివరాలను రైతులకు తెలియజేశారు. అయితే, ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ద్రాక్ష పంటకు తెలంగాణ పుట్టినిల్లుగా ప్రసిద్ధి. గ్రామీణ ప్రాంతాల్లో సరియైన అవగాహనలేక అధికశాతం రైతులు ద్రాక్ష పంట సాగు వదిలేయడంతో సాగు విస్తీర్ణం క్రమంగా పడిపోతుంది. ద్రాక్ష పంట సాగు పట్ల రైతుల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు గ్రేప్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.