చంద్రబాబు వద్దకెళ్లిన ఉత్తమ్ దంపతులు భోజనం చేసి కృష్ణ జలాలను ఏపీకి అప్పగించారు.. హరీశ్ రావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి భార్యాభర్తలు భోజనం చేసి కృష్టా జలాలను ఏపీకి కేటాయించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా..?

Harish Rao
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండోరోజు కూడా చర్చ కొనసాగుతోంది. అయితే, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ సభ్యులు బైకాట్ చేశారు. అనంతరం అసెంబ్లీ వద్ద మీడియా చిట్ చాట్ లో హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ‘మార్చురీ’ కామెంట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ.. కేసీఆర్‌ను కాదంటూ.. ఉగ్రరూపం
చావుకు తెగించి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయుడు కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారు.. అందుకే రేవంత్ స్పీచ్ ను బైకాట్ చేశామని హరీశ్ రావు అన్నారు. ఇంత నీచపు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని నేను ఇంత వరకు చూడలేదని అన్నారు.
Also Read: BV Raghavulu: జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై బీవీ రాఘవులు కీలక కామెంట్స్
ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి భార్యాభర్తలు భోజనం చేసి కృష్టా జలాలను ఏపీకి కేటాయించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా..? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. కృష్ణా జలాల సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. కృష్ణా జలాల పంపిణీ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు కేటాయించిందే కాంగ్రెస్ పార్టీ. తాత్కాలికంగా వాటా తేల్చింది కాంగ్రెస్ పార్టీ కాదా..? కృష్ణా జిల్లాల్లో వాటాను తాత్కాలికంగా మేము ఒప్పుకున్నామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. ఈ ఏడాది కూడా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం ఎందుకు పెట్టి వచ్చిందని హరీశ్ రావు ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు ఎందుకు సంతకం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి కేటాయింపులపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అప్పట్లో పీజేఆర్ మాత్రమే ఫైట్ చేసిండు. ఆ తరువాత పోతిరెడ్డిపాడుపైన బీఆర్ఎస్ ఫైట్ చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎటుపోయిండు..? కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర మంత్రి పదవి పోతుందని భయపడ్డాడని హరీశ్ రావు విమర్శించారు. ప్రస్తుతం రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే కారణం అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.