కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై కాంగ్రెస్ సర్కార్ ప్లానేంటి? అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోందా? బీఆర్ఎస్ అనుమానం ఏంటి?
ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్తే తగిన ఆధారాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తాము కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక కావాలని సీఎస్‌ను కోరామని చెప్పేందుకే హరీశ్‌రావు, కేసీఆర్ పేర్లతో వేర్వేరుగా లేఖలు ఇచ్చారట.

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై కాక ఎక్కువైంది. కమిషన్ 655 పేజీల రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం 60పేజీల రిపోర్ట్‌ను మాత్రమే ప్రజల ముందు పెడుతుందని మండిపడుతోంది బీఆర్ఎస్. జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్‌పై అధికారుల కమిటీని నియమించిన సర్కార్..650 పేజీల కాళేశ్వరం నివేదికను 60 పేజీల సారాంశంగా తయారు చేసింది. క్యాబినెట్‌కు సమర్పించిన నివేదికలో 32 సార్లు కేసీఆర్ పేరు, 19 సార్లు హరీశ్ రావు, 5 సార్లు ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలకు..ప్రత్యక్షంగా, పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో పొందుపరిచారని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు చెబుతున్నారు.
అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చకు పెడుతామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడే బీఆర్ఎస్ పలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. కాంగ్రస్ ప్రభుత్వం 655 పేజీల రిపోర్టు బయట పెట్టకుండా.. 60 పేజీల రిపోర్టును విడుదల చేయడమేంటంటున్న గులాబీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కమిషన్ చెప్పిన విషయాలే చెప్పారా.? లేదంటే ప్రభుత్వం ఏమైనా వండి వార్చిందా అని డౌట్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన 655 పేజీల నివేదిక పెడితే అసలు వాస్తవం తెలుస్తుందంటున్న బీఆర్ఎస్.. ప్రభుత్వం బయటపెట్టిన రిపోర్టు పూర్తిగా బేస్ లెస్ అని కొట్టపారేస్తోంది.
Also Read: కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా? జిల్లా కేంద్రాలను మారుస్తారా?
కమిషన్ ఇచ్చిన 655 పేజీల పూర్తి నివేదికను కాకుండా..60 పేజీల రిపోర్ట్‌ను మాత్రమే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అనుమానిస్తోంది బీఆర్ఎస్. అందుకే కాళేశ్వరం కమిషన్ పూర్తి రిపోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నారట మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసిన హరీశ్‌రావు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 655 పేజీల నివేదికను తమకు ఇవ్వాలని కోరారు. కేసీఆర్ పేరుతో కూడా వినతి పత్రం ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కావాలని హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తిని పరిశీలించి..త్వరలోనే సమాధానం చెబుతామని సీఎస్ రామకృష్ణారావు చెప్పినట్లు తెలుస్తోంది.
న్యాయపోరాటం చేయాలని బీఆర్ఎస్ యోచన?
ఒకవేళ తాము అనుమానిస్తున్నట్టే అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన 655 పేజీల పూర్తి నివేదిక కాకుండా కేవలం 60 పేజీల రిపోర్ట్‌ను మాత్రమే పెడితే.. న్యాయపోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందట. పీసీ ఘోష్ కమిషన్ విచారణ, రిపోర్ట్ నివేదిక, ప్రభుత్వ వైఖరిపై కోర్టుకెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్తే తగిన ఆధారాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తాము కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక కావాలని సీఎస్‌ను కోరామని చెప్పేందుకే హరీశ్‌రావు, కేసీఆర్ పేర్లతో వేర్వేరుగా లేఖలు ఇచ్చారట. దరఖాస్తు పెట్టినట్లు ఎకనాలెడ్జ్‌మెంట్ కూడా తీసుకున్నారు. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై కోర్టుకెళ్లాల్సి వస్తే పూర్తి సాక్షాధారాలు ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందట గులాబీ పార్టీ. ప్రభుత్వం పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతుందా.? లేక బీఆర్ఎస్ అనుమానిస్తున్నట్లు 60 పేజీల రిపోర్ట్ మాత్రమే అసెంబ్లీలో పెడుతురా.? అన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.