Harish Rao: అందుకే రేవంత్‌కి టీపీసీసీ, బండి సంజయ్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులు వచ్చాయి: హరీశ్ రావు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.

Harish Rao: అందుకే రేవంత్‌కి టీపీసీసీ, బండి సంజయ్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులు వచ్చాయి: హరీశ్ రావు

Harish Rao (Photo : Twitter)

Updated On : May 27, 2023 / 3:51 PM IST

Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ లేకుంటే వచ్చేదా? అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అడిగారు. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి (Revanth Reddy) టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేవారా? అని అన్నారు. అలాగే బండి సంజయ్ (Bandi Sanjay)కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి వచ్చేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే వారు ఆయా పదవులు అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషితో జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించుకుని, ప్రారంభించుకున్నామని హరీశ్ రావు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా వచ్చి ఉండేది కాదని హరీశ్ రావు చెప్పారు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అయిదు కాలేజీలు నిర్మించుకున్నామని వివరించారు. గతంలో కొడంగల్ కు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారని, ఏ అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదని అన్నారు. లక్ష్మారెడ్డి మాత్రం కొడంగల్ కు వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చారని చెప్పారు.

TDP Mahanadu 2023 : స్కాముల్లో జగన్‌ది మాస్టర్ మైండ్.. పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు వేసేలా ఏపీలో పాలన..