Mohammad Azharuddin : అజారుద్దీన్ మోసం చేశాడు, అవినీతితో భ్రష్టు పట్టించాడు-హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్
అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సీపీకి ఫిర్యాదు చేశామన్నారు వినోద్. దీనిపై ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ ని కోరామన్నారు.

Mohammad Azharuddin : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అజారుద్దీన్ పై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేసినట్లు మాజీమంత్రి, హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ చెప్పారు. సెప్టెంబర్ 26 తోనే అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, తప్పుడు పత్రాలతో బీసీసీఐని మోసం చేశారని ఆరోపించారు. అజారుద్దీన్ తీరు కరెక్ట్ కాదన్నారు.
ఎవరినీ సంప్రదించకుండానే పదవీ కాలం గడువుని పొడిగించుకుంటూ అజారుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారని వినోద్ మండిపడ్డారు. అందుకే అజార్ పై రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 18న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరయ్యేందుకు అజారుద్దీన్ ప్లాన్ వేశాడని వినోద్ చెప్పారు. అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సీపీకి ఫిర్యాదు చేశామన్నారు వినోద్. దీనిపై ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ ని కోరామన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
”ఉప్పల్ స్టేడియం కట్టింది మేము. దానికి 22 ఎకరాల స్థలాన్ని కేటాయించింది మేము. కానీ వాస్తవ పరిస్థితిలు చూస్తే చాలా బాధగా ఉంది. అజార్ వచ్చిన తర్వాత అవినీతితో హెచ్ సీఏని భ్రష్టు పట్టించాడు. వెంటనే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హెచ్ సీఏ పర్యవేక్షణ కమిటీ.. జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అజార్ ను ఓడించి రానున్న కాలంలో క్రికెట్ ను అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉన్నాం” అని హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ అన్నారు.