HCU Lands Dispute : హెచ్‌సీయూ భూముల వివాదంపై హైకోర్టులో విచారణ..

హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు.

HCU Lands Dispute : హెచ్‌సీయూ భూముల వివాదంపై హైకోర్టులో విచారణ..

Updated On : April 2, 2025 / 5:43 PM IST

HCU Lands Dispute : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. భూముల వేలం ప్రక్రియ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నిన్న పిటిషన్ దాఖలైంది. వర్సిటీలో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో హైకోర్టు విచారణ చేపట్టింది. కంచ గచ్చిబౌలి భూవివాదంఫై కోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ వాదనలు వినిపిచారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 54ను సవాల్ చేశారు పిటిషనర్. జీవో 54ను రద్దు చెయ్యాలని కోరుతూ వాదనలు వినిపించారు. HCUలో ఉన్న 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని సర్కార్ చెబుతోందన్నారు. ఒక వేల ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని పిటిషనర్ రవిచంద్ తేల్చి చెప్పారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి వేలం వ్యవహారం హైకోర్టుకి చేరింది. హైకోర్టు డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టింది. భూముల వ్యవహారంపై హైకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనే ఉత్కంఠ నెలకొంది.

అటు..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.  విద్యార్థులు ఆందోళనలు నాలుగో రోజుకి చేరాయి. భూముల వేలం ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తుండగా వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వెంటపడి తీవ్రంగా కొట్టారు. యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బీజేపీ మహిళా మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Also Read : మా ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది- హెచ్ సీయూ భూముల వివాదంపై మంత్రులు

మరోవైపు హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులను మాత్రమే వర్సిటీ లోపలకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. డ్రోన్లు ఎగరవేసి వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.