Hydra Commissioner Ranganath : సుప్రీంకోర్టు లాయర్‌కు హైడ్రా కమిషనర్ వార్నింగ్..! అసలేం జరిగిందంటే..
బాధితులతో మాట్లాడుతూ ఉండగా సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మధ్య వాగ్వాదం జరిగింది.

Hydra Commissioner Ranganath : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. సర్వే నెంబర్లు 176, 177లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ కు వచ్చారు. బాధితులతో మాట్లాడుతూ ఉండగా ఐలాపూర్ వాసి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మధ్య వాగ్వాదం జరిగింది.
Also Read : అంతా సర్దుకున్నట్లేనా? ఎమ్మెల్యేలు చల్లబడినట్లేనా? ఇంతకీ సీఎల్పీ భేటీలో తేలిందేమిటి..
తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ ను ప్రశ్నించారు ముఖీం. కోర్టు పరిధిలో ఉన్న దాన్ని చూసేందుకు ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. హైడ్రా అంటే గ్రామస్తులు భయపడుతున్నారని చెప్పారు. అయితే, తన దగ్గర ఓరాక్షన్ చేయొద్దంటూ ముఖీంను హెచ్చరించారు కమిషనర్ రంగనాథ్.
”ఐలాపూర్ కు చెందిన స్థానికులు ప్రజావాణికి వచ్చి మాకు ఫిర్యాదు చేశారు. 1980లలో తాము తీసుకున్న ప్లాట్లను కబ్జా చేశారని మాకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న అడ్వకేట్ ముఖీం.. కొంతమంది ఎస్టీలను ముందు పెట్టి తమ ప్లాట్లను కబ్జా చేశారని ఆరోపించారు. లేఔట్లు కొన్న వారిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద వాళ్లం ఉన్నామని బాధితులు చెప్పారు.
Also Read : గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్..
మా ప్లాట్లను కబ్జా చేసి కొన్ని ఇళ్లు కడితే వాటిని కూలగొట్టారని, అయినా కట్టడం ఆపడం లేదని స్థానికుల నుంచి మాకు వచ్చిన ఫిర్యాదు. ప్రజావాణిలో మాకు అందిన ఫిర్యాదుతో మేము ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నాం. అలాగే అడ్వకేట్ ముఖీం కూడా తన వాదనలు వినిపించారు” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.