ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ ప్రజలకు మరో రెండ్రోజులు వానగండం

  • Published By: naveen ,Published On : October 20, 2020 / 04:12 PM IST
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ ప్రజలకు మరో రెండ్రోజులు వానగండం

Updated On : October 20, 2020 / 6:33 PM IST

Hyderabad heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు.




నగరవాసులకు మరో రెండ్రోజులు వానగండం పొంచి ఉందన్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలాలు, మ్యాన్ హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సహాయక బృందాలు ప్రజలను బోట్లలో రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నాయి. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరారు.