Hyderabad Rain : హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్టలో వర్షం పడింది.

Heavy Rain In Hyderabad
Hyderabad Rain : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్టలో వర్షం పడింది. రోడ్లు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం రెండు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల వద్ద ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది.
అలాగే ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.