KTR : కేటీఆర్ విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించిన హైకోర్టు..
విచారణకు హాజరవడానికి మీకు అభ్యంతరం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది.

KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ విచారణ సమయంలో కేటీఆర్ వెంట లాయర్ ను అనుమతించాలని కోర్టు చెప్పింది. కేవలం విచారణ చూడటానికి మాత్రమే లాయర్ కు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. కేటీఆర్ ఓ గదిలో, లాయర్ మరో గదిలో ఉండాలని న్యాయస్థానం చెప్పింది. విచారణపై కేటీఆర్ కు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని న్యాయమూర్తి అన్నారు. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే.రామచందర్ రావును కేటీఆర్ వెంట వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది.
విచారణకు హాజరవడానికి మీకు అభ్యంతరం ఏంటి?
కాగా, విచారణకు హాజరవడానికి మీకు అభ్యంతరం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది. విచారణలో ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ హైకోర్టుకు రావొచ్చని సూచించింది. విచారణ సమయంలో కేవలం చూడడానికి మాత్రమే అడ్వకేట్ ను అనుమతి ఇస్తామంది. విచారణ సమయంలో కేటీఆర్ ను విండో నుండి చూడవచ్చంది. న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా విజిబుల్ డిస్టెన్స్ ఏసీబీకి ఉందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ కోర్టుకు తెలిపారు. లైబ్రరీ రూమ్ లో అడ్వకేట్ ఉండడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. కాగా, పిటిషన్ విచారణ సందర్భంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను కేటీఆర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు.
Also Read : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో కింగ్ ఫిషర్, హైన్‌కెన్ బీర్లు బంద్.. ఎందుకంటే?
విచారణ సమయంలో తనతో పాటు లాయర్ అనుమతించాలని పిటిషన్..
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో గురువారం విచారణకు హాజరు కావాలని ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. అయితే, ఏసీబీ విచారణ సమయంలో తనతో పాటు తన లాయర్ ను అనుమతించేలా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరిపింది. ఈ విచారణలో కొన్ని కీలక అంశాలను కోర్టు ప్రస్తావించింది.
దర్యాఫ్తు దశలో ఉన్నటువంటి కేసులో న్యాయవాదిని ఏ విధంగా అనుమతిస్తారు?
దర్యాఫ్తు దశలో ఉన్నటువంటి కేసులో ఒక న్యాయవాదిని ఏ విధంగా అనుమతిస్తారు? కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కేసులో ఎక్కడా కూడా న్యాయవాదిని అనుమతించలేదు. కేవలం విజిబుల్ డిస్టెన్స్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తెలిపింది. విచారణ సమయంలో దర్యాఫ్తు అధికారుల పక్కనే కూర్చుని వారు ఏం అడుగుతున్నారు? వీళ్లు ఏం చెబుతున్నారు? ఇవన్నీ తెలుసుకునేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది.
Also Read : కేసీఆర్ రంగంలోకి దిగే సమయం వచ్చేసిందా..? కేటీఆర్ అరెస్ట్ అయితే.. కారు స్టీరింగ్‌ను తీసుకునే చేతులేవి..