Telangana Lockdown: తెలంగాణ లాక్‌డౌన్ తీరుపై హైకోర్టు సీరియస్

తెలంగాణ లాక్‌డౌన్ తీరుపై హైకోర్ట్ సీరియస్ అయింది. దేశంలో ఎక్కడా లేనంతగా సడెన్ గా లాక్‌డౌన్ ఇంత వేగంగా ప్రకటించారు. వలస కార్మికులు, సొంతూళ్లకు వెళ్లాల్సిన వారు ఎలా వెళ్తారని ప్రశ్నించారు.

Telangana Lockdown: తెలంగాణ లాక్‌డౌన్ తీరుపై హైకోర్టు సీరియస్

High Court

Updated On : May 11, 2021 / 3:46 PM IST

Telangana Lockdown: తెలంగాణ లాక్‌డౌన్ తీరుపై హైకోర్ట్ సీరియస్ అయింది. దేశంలో ఎక్కడా లేనంతగా సడెన్ గా లాక్‌డౌన్ ఇంత వేగంగా ప్రకటించారు. వలస కార్మికులు, సొంతూళ్లకు వెళ్లాల్సిన వారు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. సోమవారం ఉదయం వరకూ నైట్ కర్ఫ్యూ పొడిగింపు, లాక్ డౌన్ గురించి ఏ నిర్ణయం తీసుకోని ప్రభుత్వం హఠాత్ నిర్ణయం ఎందుకు తీసుకుందని ప్రశ్నించింది.

రోజువారీ కూలీలు, వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయండి. గతేడాదిలాగా ఇబ్బందులు పడకుండా చూసుకోండి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై వివరాలు ఇవ్వడానికి 3రోజుల సమయం కావాలని ఏజీ చెప్పారు. అప్పటి వరకూ ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అంటూ హైకోర్టు సీరియస్ అయింది.