MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కు దూరంగా ఉండాలని విప్‌ జారీ

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.

MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కు దూరంగా ఉండాలని విప్‌ జారీ

Hyderabad Local body MLC Elections

Updated On : April 23, 2025 / 9:32 AM IST

MLC Elections in Hyderabad: హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభమైంది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటల వరకు ఓలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

Also Read: Kashmir Terror Attack: భర్తను కాల్చేయడంతో నన్నూ చంపేయండంటూ ఉగ్రవాదులను వేడుకున్న భార్య.. అప్పుడు టెర్రరిస్టులు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే..

హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మొత్తం 112 మంది ఉన్నారు. వీరంతా ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే, బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉంటామని ప్రకటించగా.. కాంగ్రెస్ ఓటింగ్ లో పాల్గొంటుందని ప్రకటించింది. ఈ రెండు పార్టీలు పోటీలో అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది.

ఏపీ పదో తరగతి ఫలితాలు | Check Ap 10th Class Results 2025

ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం ముగియడంతో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. బీజేపీ తరపున గౌతం రావు బరిలోకి దిగగా.. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం బలాబలాలను పరిశీలిస్తే.. ఎంఐఎం బలం 49.. బీజేపీ బలం 25 ఓట్లు ఉండగా బీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 14 ఓట్ల బలం కలిగి ఉంది. ఎక్కువ ఓటర్లున్న ఎంఐఎం పార్టీ ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంటుందని మొదట్లో అంతా భావించారు. అనూహ్యంగా బీజేపీ పోటీలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది.