Hyderabad : మెట్రో రైలు మరో 45 నిమిషాల సమయం పెంపు
లాక్ డౌన్ తర్వాత..ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు...9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమయంలో కూడా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Metro Hyderabad
Hyderabad Metro Train : నగరంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. కరోనా కారణంగా ఇన్ని రోజులు నిలిచిపోయిన మెట్రో రైళ్లు మళ్లీ పట్టాలమీదకు ఎక్కాయి. ఎంతో మంది ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల పాటు మాత్రమే అనుమతించారు.
దీంతో ప్రజా రవాణాలో కీలక భాగాలైన ఆర్టీసీ బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. షెడ్లకే పరిమితమయ్యాయి. క్రమక్రమంగా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ..మెట్రో రైళ్ల సమయాల్లో మాత్రం మార్పులు చేశారు.
లాక్ డౌన్ తర్వాత..ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు…9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ సమయంలో కూడా మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా..మరో 45 నిమిషాల పాటు సమయాన్ని పెంచారు. శుక్రవారం నుంచి రాత్రి 9.45 గంటల వరకు సర్వీసులు నడువనున్నాయి. చివరి రైలు 10.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని HMR అధికారులు వెల్లడించారు.