Hydraa Commissioner : హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం
Hydraa Commissioner Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. చైతన్య రంగనాథ్ వద్ద గన్‌మెన్
Hydra Commissioner Ranganath Gunman
Hydraa Commissioner Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. చైతన్య రంగనాథ్ వద్ద గన్‌మెన్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం హయత్‌నగర్‌లోని తన నివాసంలో తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగానే చైతన్య ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు తెలుస్తోంది.
గన్‌మెన్ చైతన్య ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ చైతన్య కుటుంబ సభ్యులను రంగనాథ్ కలిశారు. వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. హైడ్రా నుంచి పూర్తి సహాయం ఉంటుందని రంగనాథ్ హామీ ఇచ్చారు. ఈ ఘటనను సంచలనంగా చేయొద్దని మీడియాకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
చైతన్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల వల్ల చైతన్య అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. అప్పులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం చైతన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు సర్జరీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. చైతన్య కుటుంబాన్ని కలిసిన రంగనాథ్.. కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
