KA Paul : కాంగ్రెస్‌కు 30 సీట్లు వచ్చినా మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు- కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
KA Paul Sensational Comments : మోడీని తిట్టిన పవన్ కల్యాణ్ మళ్ళీ మోడీతో కలిశారు. ప్యాకేజీ స్టార్స్ ను తెలంగాణ ప్రజలు నమ్మవద్దు.

KA Paul Sensational Comments (Photo : Facebook)
తనదైన వ్యాఖ్యలతో, చేష్టలతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. రాజకీయాలకు, రాజకీయ నేతలకు సంబంధించి కేఏ పాల్ చేసే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల గురించి ఆయన ఇచ్చే స్టేట్ మెంట్స్ డిస్కషన్ కు దారితీస్తుంటాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. కేఏ పాల్ CEO వికాస్ రాజ్ ను కలిశారు. ప్రజాశాంతి పార్టీకి సింబల్ ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు సింబల్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు కేఏ పాల్.
సింబల్ రాకుండా బీఆర్ఎస్ కుట్ర?
”నా జీవిత కాలంలో ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని చూడలేదు. డెమోక్రసీ బతికే ఉందా అని అనిపిస్తోంది. ఎన్నికల అధికారులు కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీకి సింబల్ కేటాయించకపోవడంలో అధికార పార్టీ కుట్ర ఉంది. ఇండియాలో చట్టాలు మార్చకపోతే ఈ దేశం సుడాన్, పాకిస్తాన్ లా అవుతుంది. అన్ని డాక్యుమెంట్స్ ECIకి ఇచ్చినా సింబల్ కేటాయించలేదు. మేము హెలికాప్టర్ లేదా రింగ్ సింబల్ అడిగాము. మేము అడిగిన సింబల్ ఇవ్వకపోతే మరొకటి ఏదైనా ఇవ్వాలి. రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్నా సింబల్ ఎందుకు ఇవ్వడం లేదు?
నోటాకు ఓటు వేయండి..
రెండు రోజుల్లో సింబల్ కేటాయించకపోతే ప్రజలు ఓట్లు వేయొద్దు. ఓటు వేయాలనుకుంటే నోటాకు వేయండి. పాల్ రావాలి.. పాలన మారాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు 30 సీట్లు వచ్చినా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. మోడీని తిట్టిన పవన్ కల్యాణ్ మళ్ళీ మోడీతో కలిశారు. ప్యాకేజీ స్టార్స్ ను తెలంగాణ ప్రజలు నమ్మవద్దు. ప్రజాశాంతి పార్టీ ఇప్పుడు సింబల్ ఇవ్వడంతో పాటు రెండు రోజుల పాటు నామినేషన్ వేయడానికి సమయం పొడిగించాలి” అని ఈసీకి విజ్ఞప్తి చేశారు కేఏ పాల్.
Also Read : అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. శామ్యూల్ ను గెలిపించి రేవంత్, సోనియాకు గిఫ్ట్ ఇస్తా : అద్దంకి దయాకర్