Kishan Reddy : తెలంగాణలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల కల నెరావేరాలన్నా బీజేపీని గెలిపించండి- కిషన్ రెడ్డి
కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి వేసినట్లే. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మజ్లిస్ కి వేసినట్లే. Kishan Reddy - Khammam

G Kishan Reddy (Photo : Google)
Kishan Reddy – Khammam : తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల కల నెరవేరాలన్నా బీజేపీని గెలిపించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రైతుల గోసపై బీజేపీ భరోసా ఇస్తుందన్నారు. రజాకార్ల వారసత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వచ్చి 75 ఏళ్లు అయ్యిందన్నారు. అభినవ సర్ధార్ పటేల్ అమిత్ షా అని కీర్తించారు.
” తెలంగాణ విమోచన ఉత్సవాలు చేశాం. కేసీఆర్ పాలన లో వ్యవసాయం విధ్వంసం అయ్యింది. కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగ అయ్యింది. ఫసల్ భీమా పథకం అమలు చేయలేదు. 9ఏళ్లుగా వ్యవసాయ రుణాలు, పావలా వడ్డీ ఇవ్వడం లేదు. రైతుల ఆత్మహత్యల్లో 70 శాతం కౌలు రైతులు ఉన్నారు. కల్తీ విత్తనాలకు కేరాఫ్ గా తెలంగాణ మారింది.
ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ తూతూ మంత్రం. రుణమాఫీ రైతులను మోసం చేయటమే. ప్రభుత్వం రైతులకు మేలు చేయలేదు. ఖమ్మం జిల్లాలో వర్షాలు, వరదలకు నష్టపోయేది రైతులు. తొమ్మిదేళ్లుగా పంటల భీమా చేయకపోవడంతో రైతులకు సాయం అందటం లేదు. కోటి ఎకరాల సాగుభూమి అన్నారు. ఎక్కడికి పోయింది. కోటి ఎకరాల మాగాణి ఏది? ధరణి పోర్టల్ .. కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక పోయినట్లుంది.
బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాం. ప్రకృతి వైపరిత్యాల సమయంలో రైతులకు అండగా ఉంటాం. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన వ్యవసాయం ఎప్పుడూ బాగుపడదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పని చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసమే.
Also Read..BRS Leaders Comments: అత్యుత్సాహం ప్రదర్శిస్తే హాట్‌టాపిక్‌గా మారడం ఖాయం!
కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటు వేసినట్లే. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మజ్లిస్ కి ఓటు వేసినట్లే. ఈ రాష్ట్రంలో మార్పు రావాలన్నా, తెలంగాణ ఉద్యమకారుల కల నెరావేరాలన్నా బీజేపీనే గెలిపించండి. రైతులారా బీజేపీని ఆదరించండి” అని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.