BRS Party: బీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కాంగ్రెస్ గూటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీలక నేత

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గుడ్ బై చెప్పారు.

BRS Party: బీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కాంగ్రెస్ గూటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీలక నేత

DCCB chairman Manohar Reddy

Updated On : October 5, 2023 / 9:45 AM IST

Buyyani Manohar Reddy : తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలను పూర్తిచేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. త్వరలో రెండు పార్టీలు నియోజకవర్గాల వారిగా తమతమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్, బీజేపీలవైపు చూస్తున్నారు. మరోవైపు కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Read Also : CM Jagan : ఢిల్లీకి సీఎం జగన్.. ముఖ్యమంత్రి హస్తిన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సన్నిహిత నేతగా మనోహర్ రెడ్డికి పేరుంది. పరిగి నియోజకవర్గం టికెట్ ను ఆశించాడు. కానీ, ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవటంతో మనోహర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మనోహర్ రెడ్డిని సంప్రదించడంతో పాటు, తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.

Read Also : Balakrishna : చంద్రబాబు అరెస్ట్.. జూనియర్ ఎన్టీఆర్‌ మౌనంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

మనోహర్ రెడ్డి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం ఆయన నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ హాజరు కానున్నారు. అనంతరం ప్రసాద్, రామ్మోహన్ రెడ్డిలు మనోహర్ రెడ్డిని రేవంత్ వద్దకు తీసుకెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.