Maganti Sunitha: వివాదంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..

మాగంటి గోపీనాథ్ కు సునీత రెండో భార్య అవునా కాదా నే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదంది.

Maganti Sunitha: వివాదంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..

Updated On : October 22, 2025 / 6:30 PM IST

Maganti Sunitha: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. మాగంటి గోపీనాథ్ కుమారుడే సునీతపై ఫిర్యాదు చేశారు. సునీతతో గోపీనాథ్ కు వివాహమే కాలేదన్నారు. ఇటు తన తల్లి మాలిని దేవితో గోపీనాథ్ కు విడాకులు కూడా కాలేదని ఫిర్యాదులో వివరించారు. తానే ఏకైక చట్టబద్ధ కుమారుడిని అని తారక్ ప్రద్యుమ్న చెప్పుకొచ్చారు. ఈసీకి సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె నామినేషన్ రద్దు చేయాలంటూ లేఖ రాశారు.

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. సునీత.. మాగంటి గోపీనాథ్ భార్య కాదని ఆరోపించారు. నామినేషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాగంటి గోపీనాధ్.. ఎమ్మెల్యే అఫిడవిట్ లో తన తల్లి మాలిని పేరు చూపించకుండా సునీత పేరు పెట్టారని ఆరోపించారు. తన తల్లి మాలినితో డివోర్స్ కాలేదన్నారు. మాగంటి గోపీనాథ్ తో సునీత లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని ప్రద్యుమ్న తెలిపారు.

దీనిపై ఈసీ స్పందించింది. మాగంటి గోపీనాథ్ కు సునీత రెండో భార్య అవునా కాదా నే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదంది. ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు సునీత నామినేషన్ కు లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం.

Also Read: రవాణా చెక్ పోస్టులు మూసివేత.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..