Wanaparthy Atmeeya Meeting : వనపర్తిలో జూపల్లి, పొంగులేటి ఆత్మీయ సమావేశం
వనపర్తిలో ఆదివారం సాయంత్రం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం జరుగనుంది. మంత్రి నిరంజన్ రెడ్డి టార్గెట్ గా వనపర్తి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Jupally - Ponguleti
Jupally Krishnarao – Ponguleti Srinivas Reddy : జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఆత్మీయ సమ్మేళనాలతో దూకుడు పెంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన ఆత్మీయ సమ్మేళనాలను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఇద్దరు నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మేరకు జూపల్లి, పొంగులేటి వనపర్తి ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. వనపర్తిలో ఆదివారం సాయంత్రం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం జరుగనుంది. మంత్రి నిరంజన్ రెడ్డి టార్గెట్ గా వనపర్తి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Jupally, Ponguleti: పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్.. క్లారిటీ ఇచ్చిన నేతలు
ఈ ఆత్మీయ సమావేశానికి పలువురు నేతలు హాజరు కానున్నారు. అధికార బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే వ్యూహం చేస్తున్నారు. బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలందరూ ఒకే చోటుకు చేరుతున్నట్లు కనిపిస్తోంది.
జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పయనమెటు? తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న కాంగ్రెస్ గూటికి చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.