Justice NV Ramana : హైదరాబాద్‌కు జస్టిస్ ఎన్వీ రమణ.. సీజేఐ హోదాలో తొలిసారి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం (జూన్ 11)న హైదరాబాద్ రానున్నారు. ఆయన సీజే అయ్యాక తొలిసారి హైదరాబాద్‌ నగరానికి రానున్నారు.

Justice NV Ramana : హైదరాబాద్‌కు జస్టిస్ ఎన్వీ రమణ.. సీజేఐ హోదాలో తొలిసారి

రానున్న

Updated On : June 10, 2021 / 9:44 PM IST

Justice NV Ramana to Tour Hyderabad : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రేపు  (జూన్ 11)శుక్రవారం రోజున హైదరాబాద్ రానున్నారు. ఆయన సీజేఐ అయ్యాక తొలిసారి హైదరాబాద్‌ నగరానికి రానున్నారు. ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలకనున్నారు. అనంతరం రాజ్ భవన్‌లో ఎన్వీ రమణ బస చేయనున్నారు.

తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కి పెంచారు. మరోవైపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేశారు.

సుప్రీం కోర్టు సీజేఐగా జస్టిల్ బోబ్డే పదవీకాలం ముగియడంతో ఎన్వీ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26 వరకు ఎన్వీ రమణ కొనసాగనున్నారు.