Assembly Elections 2023: పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై కాంగ్రెస్ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కె.మురళీధరన్ కామెంట్స్
మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తుందని చెప్పారు. మిత్రపక్షాల స్థానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని..

K Muraleedharan
K Muraleedharan: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై లోక్‌సభ సభ్యుడు, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కె.మురళీధరన్ స్పందించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిశీలనకు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కె.మురళీధరన్ ఇవాళ మాట్లాడుతూ… తాము ఎవరి రాజీనామాపై అయినా సరే స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. అసలు రాజీనామాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ లో చాలా మంది చేరుతున్నారని తెలిపారు. గెలుపు అవకాశాలు ఉండే వారిని, పార్టీకి విధేయతగా ఉండేవారిని అభ్యర్థులను నిర్ణయిస్తున్నామని చెప్పారు. నేటి సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయిందని తెలిపారు.
సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశం అవుతుందని, మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తుందని చెప్పారు. మిత్రపక్షాల స్థానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వివరించారు. అవి కూడా పూర్తయిన తర్వాత జాబితాను ఒకేసారి ప్రకటిస్తామని చెప్పారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఇందులో మైనారిటీలు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
2024 Elections: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేసేది ఎవరు? ఇండియా కూటమి ప్లాన్ ఏంటంటే?