KA Paul : ఇంత కక్కుర్తి ఎందుకు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలపై కేఏ పాల్ ఫైర్

మీరు సొంతంగా ఛారిటీ చేయండి. లేదంటే ఊరుకోండి. మీకు ఇంత కక్కుర్తి ఎందుకు?

KA Paul : ఇంత కక్కుర్తి ఎందుకు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలపై కేఏ పాల్ ఫైర్

Updated On : March 20, 2025 / 7:45 PM IST

KA Paul : బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖలపై నిప్పులు చెరిగారు కేఏ పాల్. కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు, హీరోయిన్లు.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటారా? మీకు మరీ ఇంత కక్కుర్తి ఎందుకు? అంటూ కేఏ పాల్ సీరియస్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి యువత జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు పాల్. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు.

”బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీలపై హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టడం చాలా మంచిది. కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకునే ఈ యాక్టర్లు, హీరోయిన్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం న్యాయమా? వారి కారణంగా యువత చెడిపోతోంది. డబ్బులు పొగొట్టుకుంటున్నారు.

Also Read : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రీతూ చౌదరి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ

మరో దారి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలు తీసుకున్న బాధితుల కుటుంబాలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినా… తిరిగి వారి ప్రాణాలు తీసుకురాగలరా? పోలీసులు కేసులు పెడుతున్నారు. విచారణ తర్వాత ఆ కేసులను విత్ డ్రా చేసుకుంటున్నారట. దానికి ఉదాహరణ అల్లు అర్జున్. ఆయనను జైల్లో పెట్టారు, 100 కోట్లు అందాయట. మళ్లీ కేసుని నీరుగార్చారు. అలా చేయొద్దు.

హీరోలు, హీరోయిన్లు వందల కోట్లు సంపాదించుకుంటున్నారు. మీరు సొంతంగా ఛారిటీ చేయండి. లేదంటే ఊరుకోండి. మీకు ఇంత కక్కుర్తి ఎందుకు? డబ్బులు తీసుకుని మరీ యాప్స్ ప్రమోట్ చేయడం దేనికి? ఇలాంటి పనికిరాని పనులు చేయకండి” అని హితవు పలికారు కేఏ పాల్.