Kadem Project: ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరదనీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Kadham
Kadem Project: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరదనీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 17గేట్లు ఎత్తి సుమారు మూడు లక్షల క్యూసెక్కల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
NASA: విశ్వరూపం అద్భుతం.. వెలుగులోకి 1300 కోట్ల ఏళ్ల నాటి అద్భుత దృశ్యాలు
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా 700 అడుగులకు నీటిమట్టం చేరింది. 7.603 టీఎంసీ లకు గాను7.603 టిఎంసీలకు వరద నీరు చేరింది. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో ఒక్కటి తెరుచుకోకపోవడంతో 17 గేట్లు తెరిచి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఇన్ ఫ్లో ప్రమాదకర స్థాయిలో వస్తుండటంతో ఔట్ ఫ్లో తక్కువగా ఉండటంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Godavari Sub-Rivers : గోదావరికి భారీగా వరద ఉధృతి..ఉగ్రరూపం దాల్చిన ఉపనదులు
ఇదిలాఉంటే కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కడెం, కన్నపూర్, దేవునిగూడెం, రాపర్, మున్యాల్, గొడిషిరియల్ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. మరికొద్దిసేపట్లో మంత్రి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇదిలా ఉంటే నిర్మల్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు రాతంత్రా ప్రాజెక్టు వద్దనే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రాజెక్టు పరిధిలోని 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.