మసీదుకు వెళ్లిన 10 మంది ఇండోనేషియన్లపై కేసు నమోదు

కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించి మసీదుల్లో మత పరమైన సమావేశాల్లో పాల్గొన్నారని కరీంనగర్ వన్ టౌన్ సీఐ విజయకుమార్ చెప్పారు.
ఇండోనేషియన్ల నిర్లక్ష్యంగా కారణంగా కరీంనగర్ లో ఇతరులకు కూడా కరోనా సోకిందని ఆయన చెప్పారు. ఈ విషయంపై కరీంనగర్ స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి చేసిప ఫిర్యాదు మేరకు సదరు ఇండోనేసియన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వీసా నిబంధనలు ఉల్లంఘించి కరీంనగర్‌కు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం. టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా… మసీదును సందర్శించడాన్ని పోలీసులు నేరంగా పరిగణిస్తున్నారు. సెక్షన్ 420, 269, 270, 188, యాక్ట్ 1897 సెక్షన్ 3 ప్రకారం ఇండోనేషియన్ల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.