కోహ్లీకి అనుష్కే హెయిర్ కట్ చేస్తోంది.. అన్నయ్యా వదినకు అవకాశం ఇస్తున్నావా అంటూ కేటీఆర్‌ను ఆటపట్టించిన కవిత

కోహ్లీకి అనుష్కే హెయిర్ కట్ చేస్తోంది.. అన్నయ్యా వదినకు అవకాశం ఇస్తున్నావా అంటూ కేటీఆర్‌ను ఆటపట్టించిన కవిత

Updated On : June 23, 2021 / 4:27 PM IST

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాలు మినహా అన్ని మూతపడ్డాయి. బార్బర్ షాపులు సైతం తెరవడం లేదు. దాంతో లాక్ డౌన్ సమయంలో హెయిర్ కటింగ్ చేయించుకునే పరిస్థితి లేదు. అందరికి జుట్టు, గడ్డం భారీగా పెరిగిపోతుంది. కొందరు గడ్డం షేవ్ చేసుకుంటున్నారు. కానీ, తలపై హెయిర్ కటింగ్ గుబురుగా పెరిగిపోతోంది. లాక్ డౌన్ ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు.. అప్పటివరకూ హెయిర్ కటింగ్ చేసుకోకుండా ఇలానే ఉండిపోవాలా అని మదనపడుతున్నారు. ఏప్రిల్ 20 తర్వాత సడలింపులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించడంతో అందులో బార్బర్ షాపులకు కూడా ఉంటాయా? అని ఓ నెటిజన్ సరదాగా కేటీఆర్‌కు ఇలా ట్వీట్ చేశాడు..

కేటీఆర్ గారూ.. ఏప్రిల్ 20 తర్వాత బార్బర్ షాపులు తెరిచే అవకాశం ఉందా? అని అడిగాడో నెటిజిన్.. లేదంటే తన భార్య హెయిర్ కట్ చేసేందుకు తెగ ఉత్సాహపడుతుందని అన్నాడు. అదే జరిగితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా ఇంట్లోనే ఉండిపోవాల్సిందేనంటూ ఓ నెటిజన్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్ కూడా ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఆయన భార్య అనుష్క శర్మ కటింగ్ చేస్తుంది కదా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కోహ్లీ మాదిరిగా మీరెందుకు ప్రయత్నించకూడదంటూ రిప్లయ్ ఇచ్చారు. కేటీఆర్ ఫన్నీ ట్వీట్ పై ఆయన సోదరి కల్వకుంట్ల కవిత స్పందించారు. అన్నయ్యా.. వదినకు కూడా అవకాశం ఇస్తున్నావా అంటూ ఆటపట్టించారు. కేటీఆర్, కవిత మధ్య ఆసక్తికరమైన ట్వీట్ సంభాషణ సాగింది.