KCR KTR Meeting: ఏం చేద్దాం డాడీ..! కేసీఆర్ తో 2గంటలు కేటీఆర్ భేటీ.. కవిత లేఖపై సీరియస్ చర్చ
కవిత బీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

KCR KTR Meeting: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ ముగిసింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వీరు దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. కవిత లేఖతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాళేశ్వరం నోటీసుల అంశంపైనా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. కవిత లేఖ ఎపిసోడ్ తర్వాత తొలిసారి కేసీఆర్ ను కలిశారు కేటీఆర్.
కవిత బీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తాను అంతర్గతంగా రాసిన లేఖ లీక్ అయ్యిందంటూ కవిత ఇటీవల ఆరోపించారు. కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. అంతర్గత వ్యవహారాలను అంతర్గతంగానే చర్చిస్తే బాగుంటుందన్నారు.
కేసీఆర్, కేటీఆర్ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బహిర్గతమైంది. దాంతో బీఆర్ఎస్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీలో కోవర్టులు, దెయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లేఖ అంశం తర్వాత కేసీఆర్ ను కేటీఆర్ కలవడం ఇదే మొదటిసారి. లేఖ అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై వీరు చర్చించినట్లు సమాచారం.
Also Read: కవిత కారు దిగాల్సిందే, బీఆర్ఎస్‌లో కొనసాగే అవకాశమే లేదిక- 10టీవీ ఇంటర్వ్యూలో ఈటల సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు, నేను నా తండ్రికి వ్యక్తిగతంగా రాసిన లేఖ ఎలా బహిర్గతమైంది? అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి. కవిత బీఆర్ఎస్ ను వీడతారని, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ ను కలిసిన కేటీఆర్.. అన్ని అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పార్టీలో ఏం జరుగుతోంది అనేది సీనియర్ నేతలకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అసలు కేసీఆర్ కుటుంబంలో ఏం జరగబోతోంది? కవిత ఎసిసోడ్ ఏ మలుపు తిరగబోతోంది? బీఆర్ఎస్ లో తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నింపాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.