Eatala Rajendar: కవిత కారు దిగాల్సిందే, బీఆర్ఎస్‌లో కొనసాగే అవకాశమే లేదిక- 10టీవీ ఇంటర్వ్యూలో ఈటల సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని, కవిత ఇష్యూ ఇక అతికే అవకాశం లేదన్నారు ఈటల.

Eatala Rajendar: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఒక్కసారి ఎవరిపైన అయినా నెగటివ్ ఒపీనియన్ వస్తే ఇక అంతే సంగతి అని వ్యాఖ్యానించారు ఈటల. కవిత బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశం లేదని, ఇక కారు దిగాల్సిందేనని జోష్యం చెప్పారాయన. కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని, కవిత ఇష్యూ ఇక అతికే అవకాశం లేదన్నారు ఈటల.
Also Read: అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడం కోసమే కవిత లేఖ.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్
”కేసీఆర్ దగ్గర.. ఒక మనిషి నెగటివ్ అభిప్రాయం కలిగించుకున్నాక.. అతకడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కూతురి మీద కూడా ఎక్కడో నెగటివ్ ఒపీనియన్ వచ్చి ఉంటుంది. ఆయన చట్టంలో ఇమడని వారిని ఆయన ఎప్పుడూ అసహ్యించుకుంటారు. కుటుంబంలో ఏం జరిగిందో కానీ కవిత ఇక అతికే ప్రసక్తే లేదు” అని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు.
కేసీఆర్ కు ఆయన కూతురు కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ లో చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే. కవిత లేఖ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. అమెరికా నుంచి హైదరబాద్ వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన కవిత.. మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత్ అన్నారు. పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్ కు తానే లేఖ రాశానన్న కవిత, అంతర్గతంగా రాసిన లేఖను ఎలా బహిర్గతం చేస్తారని ప్రశ్నించారు. దీంతో కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేస్తారనే ప్రచారం జరుగుతోంది.