Warangal Brs Mp Candidate : కేసీఆర్ కీలక నిర్ణయం.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు

ఈ మేరకు అందరితో చర్చించిన కేసీఆర్.. వారి సలహా సూచనల మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

Warangal Brs Mp Candidate : కేసీఆర్ కీలక నిర్ణయం.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు

Warangal Brs MP Candidate

Updated On : April 12, 2024 / 7:08 PM IST

Warangal Brs Mp Candidate : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్. డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. డాక్టర్ సుధీర్ హన్మకొండ జిల్లా వాసి. మాదిగ సామాజికవర్గానికి చెందిన సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా గుర్తింపు పొందారు.

అధినేత కేసీఆర్ తో కలిసి పని చేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించిన కేసీఆర్.. వారి సలహా సూచనల మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

గతంలో వరంగల్ ఎంపీ టికెట్ ను కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించారు కేసీఆర్. అయితే కడియం కావ్య అనూహ్యంగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో మరోసారి కొత్త అభ్యర్థిని ప్రకటించాల్సి వచ్చింది కేసీఆర్. కొత్త అభ్యర్థిపై గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో చర్చలు జరిపిన కేసీఆర్.. ఇవాళ్ల తన ఫామ్ హౌస్ లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. అందరితో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకున్న కేసీఆర్.. సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా నిర్ణయించారు. 2001 నుంచి సుధీర్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది. ఉద్యమ సమయం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడంతో సుధీర్ కుమార్ కు హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పార్టీ అవకాశం కల్పించింది.

Also Read : 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్