15 రోజుల్లోగా ఆస్తుల వివరాలను వంద శాతం ఆన్‌లైన్‌ చేయాల్సిందే : కేసీఆర్

  • Published By: sreehari ,Published On : September 22, 2020 / 08:39 PM IST
15 రోజుల్లోగా ఆస్తుల వివరాలను వంద శాతం ఆన్‌లైన్‌ చేయాల్సిందే : కేసీఆర్

Updated On : September 22, 2020 / 8:48 PM IST

ధరణి పోర్టల్‌పై తెలంగాణ  సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోగా ఆన్ లైన్‌లో ప్లాట్స్, ఇళ్లు, అపార్ట్ మెంట్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.



ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపు ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని  కేసీఆర్ సూచించారు.



ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్ మెంట్లు వందశాతం ఆన్ లైన్ చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.



ప్రజల తమ ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ లో నమోదు కాని వాటిని వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.