Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హరీశ్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

గతంలో హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హరీశ్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

Phone Tapping Case Representative Image (Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 1:38 AM IST
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్
  • హరీశ్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలని పిటిషన్
  • సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి

 

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావు విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది.

గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసుపై హరీశ్ రావు హైకోర్టుకు వెళ్లారు. హరీశ్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ సర్కార్. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సుప్రీంకోర్టులో అనేక రోజులుగా పెండింగ్ లో ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీంకోర్టు చాలా నిశితంగా పరిశీలిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వ్యాపారులు, అడ్వకేట్లు, ప్రధాన న్యాయమూర్తుల ఫోన్లు కూడా గత తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ కు పాల్పడింది అంటూ గతంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినిపించారు. గతంలో మంత్రిగా పని చేసిన హరీశ్ రావుని విచారణకు సహకరించాలని చెబుతుందా లేక హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థిస్తుందా అనేది నేడు తేలనుంది.

Also Read: తెలంగాణకు అసలు విలన్ ఆ పార్టీనే.. కేసీఆర్ తొలి నుంచి చెబుతున్న మాటలు అక్షరసత్యం అయ్యాయి.. హరీశ్ రావు