Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుంచి ఆయన వస్తున్నారు..!

ఆయన విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుంచి ఆయన వస్తున్నారు..!

Phone Tapping Case : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుండి రేపు హైదరాబాద్ కు రానున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతోంది. దీంతో ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎస్ఐబీ చీఫ్ గా ఉండి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ప్రభాకర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేయించారు ప్రభాకర్ రావు.

భుజంగరావు వేధించారు- సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన శ్రీధర్.. తన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకు ఇచ్చానన్నారు. గతంలో ఈ అంశంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. భుజంగరావు తన ఫోన్ ను ట్యాప్ చేసి ఇబ్బందులకు గురి చేశారని, ఆఫీసుకి పిలిపించి బెదిరించారని శ్రీధర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ దర్యాఫ్తు బృందాలకు ఇచ్చామని శ్రీధర్ వెల్లడించారు.

Also Read : వలసలను నిలువరించలేకపోతున్న గులాబీబాస్.. ఏం జరుగుతోందో తెలుసా?