Kishan Reddy: హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి: కిషన్ రెడ్డి
ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పును తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారని వివరించారు.

Kishan Reddy
Kishan Reddy – G20 : దేశంలో జీ 20 సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అనేక అంశాలపై చర్చలకు భారత్ (India) వేదికైందని తెలిపారు. 46 రంగాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. 75 శాతం గ్లోబల్ ట్రేడ్ జీ20 దేశాల నుంచి జరుగుతోందని తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad) హైటెక్ సిటీ వేదికగా ఈ నెల 15 నుంచి 17వరకు జరిగే సమావేశాలకు జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారని చెప్పారు. హైదరాబాద్ లో జీ20లో భాగంగా నిర్వహించే వ్యవసాయ సమావేశాల్లో ఇక్రిశాట్ కూడా పాల్గొంటుందని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయన్నారు. ఆహార భద్రత, పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పును తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారని వివరించారు. టూరిజం చివరి సమావేశాలు జూన్ 19, 20, 21, 22 తేదీల్లో గోవాలో జరుగుతాయని తెలిపారు.
గోవా రోడ్ మ్యాప్ పేరుతో డ్రాఫ్ట్ ను జీ20 మంత్రుల సమావేశంలో తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాంస్కృతిక శాఖ తుది సమావేశాలు వారణాసిలో జరుగుతాయని వివరించారు.
TS High Court : ‘ఇదో పబ్లిక్ న్యూసెన్స్’ పిటిషన్.. హరిరామ జోగయ్యపై టీఎస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం