KTR: ఏసీబీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Telangana HIgh Court
Telangana High Court : ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ1గా కేటీఆర్ పేరును చేర్చారు. దీంతో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేటీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోహషన్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే, రాజకీయ ప్రముఖులకు సంబంధించి కేసు మొత్తం జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారిస్తుంది. ఆయన సెలవులో ఉండటంతో మరొక బెంచ్ జస్టిస్ శ్రావణ్ బెంచ్ లో లంచ్ మోషన్ మెన్షన్ చేశారు. కానీ, లంచ్ మోషన్ సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రావణ్ బెంచ్ విచారించే అర్హత లేదంటూ ఏసీబీ స్టాండింగ్ కౌన్సిలర్ సింగిల్ బెంచ్ లో తమ వాదనలు వినిపించారు. దీంతో సింగిల్ బెంచ్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు నిరాకరించింది.
Also Read: Telangana Assembly : అసెంబ్లీలో రచ్చరచ్చ.. పేపర్లు, వాటర్ బాటిల్స్ విసిరిన సభ్యులు
ఆ తరువాత కేటీఆర్ తరపు న్యాయవాది మోహన్ రావు చీఫ్ జస్టిస్ అలోక్ అరుదయ్ బెంచ్ లో లంచ్ మోషన్ దాఖలు చేశారు. అయితే, లంచ్ మోషన్ పై ఇప్పటికిప్పుడు విచారించలేమని.. దీన్ని రిజిస్ట్రీ పరిగణలోకి తీసుకోవాలని రిజిస్ట్రీకి సీజే ఆదేశించారు. 2గంటల ప్రాంతంలో రిజిస్ట్రీ ఏ బెంచ్ కు ఈ పిటిషన్ ను డైవర్ట్ చేస్తారనే విషయంపై మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. ఒకవేళ చీఫ్ జస్టిస్ విచారించాలని చూస్తే 2గంటల ప్రాంతంలో సీజే బెంచ్ కు వచ్చే అవకాశం ఉంది. మరొక బెంచ్ కు బదిలీ చేస్తే ఆ బెంచ్ లో కూడా 2.30 గంటల సమయంలో విచారించే అవకాశం ఉంది. ఒకవేళ లంచ్ మోషన్ ఎమర్జెన్సీ కాకపోతే రెగ్యులర్ పిటీషన్ గా దీన్ని విచారించే అవకాశం ఉంది. ఈ విషయంపై మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది.