Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. 6 గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించిన ఏసీబీ
క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు?

Formula E Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండు భాగాలుగా మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగింది. ఆరు గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై విచారించారు. లంచ్ తర్వాత.. రేస్ కి ముందు జరిగిన అగ్రిమెంట్లపై విచారించినట్లు సమాచారం. ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ ను ఏసీబీ అధికారులు కేటీఆర్ కు చూపించినట్లు తెలుస్తోంది.
వారిద్దరి స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ..
కేటీఆర్ విచారణపై గంట గంటకు ఉత్కంఠ నడిచింది. ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు మోహరించాయి. ఆరు గంటలుగా ఏసీబీ విచారణ నడిచింది. ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ జరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం.. కేటీఆర్ ముందు ఉంచి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

KTR
క్యాబినెట్, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా నగదు బదిలీ ఎందుకు చేశారు?
FEO తో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ప్రశ్నించారు. క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు? ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపైనా ఏసీబీ ప్రశ్నించింది. ఇప్పటికే సేకరించిన పత్రాలను ముందు ఉంచి కేటీఆర్ ను ఏసీబీ క్వశ్చన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : తిరుపతి ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. వారిద్దరి వల్లే ఈ పరిస్థితి అంటూ ఆగ్రహం
కేటీఆర్ పై ప్రశ్నల వర్షం..
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించింది ఏసీబీ. విచారణ సమయంలో కేటీఆర్ కు అరగంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు అధికారులు. కేటీఆర్ ను ఏసీబీ అడిషనల్ డైరెక్టర్, అడిషనల్ డీఎస్పీ శివరామ్ శర్మ, డీఎస్పీ మాజిద్ ఖాన్ సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ నుంచి ఏసీబీ అధికారులు కీలక విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం.
ఎంత మొత్తంలో నిధులను ట్రాన్సఫర్ చేశారు?
నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. అలాగే మరో ఐఏఎస్ దాన కిశోర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ ను క్వశ్చన్ చేసినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారులను ఎందుకు ఆదేశించారు? ఎంత మొత్తంలో నిధులను ట్రాన్సఫర్ చేశారు? దీని కోసం లిఖితపూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? అని కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Also Read : ‘గేమ్‌ఛేంజర్’కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం వెనుక మతలబు ఏంటి? : రసమయి బాలకిషన్