KTR: తన పెళ్లి ఫొటో, పిల్లల ఫొటో పోస్ట్ చేసి భార్యకు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్

ఎల్లప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే కేటీఆర్.. సమయం దొరికితే కుటుంబ సభ్యులతోనే గడపడానికి ఇష్టపడతారు. 

KTR: తన పెళ్లి ఫొటో, పిల్లల ఫొటో పోస్ట్ చేసి భార్యకు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్

KTR-Shailima

Updated On : December 18, 2023 / 5:32 PM IST

Shailima: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఇవాళ 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన భార్యాపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన భార్యకు థ్యాంక్స్ చెప్పారు.

‘మై బ్యూటీఫుల్ వైఫ్ శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 20 ఏళ్లుగా నాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు, ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు, నా జీవిత ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా నిలిచినందుకు కృతజ్ఞతలు.

ఇలాగే మరెన్నో సంవత్సరాల పాటు మన జీవిత ప్రయాణం కొనసాగాలని ఆశిస్తున్నాను’ అని కేటీఆర్ అన్నారు. కాగా, కేటీఆర్ పిల్లల పేర్లు హిమాన్షు రావు, అలేఖ్య రావు. ఎల్లప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే కేటీఆర్.. సమయం దొరికితే కుటుంబ సభ్యులతోనే గడపడానికి ఇష్టపడతారు.

Minister Uttam Kumar : L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం.. తప్పు చేసినవారిపై చర్యలు తప్పవంటూ వార్నింగ్