Private Bus: అర్థరాత్రి కదిలే బస్సులో మహిళపై అత్యాచారం

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Private Bus: అర్థరాత్రి కదిలే బస్సులో మహిళపై అత్యాచారం

Ts Tourisum Rape Attempt

Updated On : February 27, 2022 / 11:13 AM IST

Kukatpally Private Bus: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంతూరు వెళ్లేందుకు వచ్చిన మహిళను నమ్మకంగా బస్సెక్కించుకుని డ్రైవర్ నీచానికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళ(29) తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌లో బేబీ కేర్ టేకర్‌గా పనిచేస్తుంది.

తన ఇద్దరు పిల్లలతో కలిసి మాదాపూర్‌లో ఉంటుండగా, ఆమె భర్త వేరుగా ఉంటున్నాడు. సొంతూరు వెళ్లేందుకు ఈ నెల 23న కూకట్‌పల్లిలో ప్రైవేటు స్లీపర్ బస్సు ఎక్కగా.. తనకు కేటాయించిన చివరి సీటులో నిద్రపోతుండగా అర్ధరాత్రి 12.30 గంటలు దాటిన తర్వాత బస్సును మరో డ్రైవర్ నడుపుతుండగా, రాజేశ్ (35) అనే ఇంకో డ్రైవర్ ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఆమె బంధువులు ఆందోళనకు దిగగా.. బస్సు దిగే సమయంలో ఆమె వద్ద నుంచి రూ. 7వేలను కూడా డ్రైవర్ దోచుకున్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు.