Bhatti Vikramarka Mallu : తెలంగాణ సమాజం ఏకం చేద్దాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం- భట్టి విక్రమార్క
Bhatti Vikramarka Mallu : కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేశాడు. వేల కోట్ల కాంట్రాక్టుల కోసం పార్టీ మారాడు.

Bhatti Vikramarka Mallu (Photo : Twitter)
Bhatti Vikramarka Mallu : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి అడుగు పెట్టింది. జిల్లా సరిహద్దు నాయకోనిగూడెం వద్ద భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీ గజమాలతో భట్టిని సత్కరించారు. గిరిజనుల నృత్యాలు, మహిళల కోలాటాలు, డప్పు వాయిద్యాలతో జిల్లాలోకి స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు.
భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నల్గొండ జిల్లాలో ముగించుకుని ఈరోజు(జూన్ 28) ఖమ్మం జిల్లాలోకి అడుగుపెట్టింది. 5 రోజుల పాటు 32 కిలోమీటర్లు మేర పాదయాత్ర సాగనుంది. ఈ నెల 30న ఖమ్మంలో పాదయాత్ర పైలాన్ ను భట్టి విక్రమార్క ఆవిష్కరించనున్నారు. ఇక భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Also Read..Chandrashekhar Azad: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు.. ఆసుపత్రికి తరలింపు
పాలేరు నియోజకవర్గం నాయకోనిగూడెంలో కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మాట్లాడారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ లక్ష్యాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చేలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కృష్ణ, గోదావరి నదుల నుంచి పొలాల్లోకి పారాల్సిన నీళ్ళు రాకుండా బీఆర్ఎస్ సర్కార్ అడ్డుగా ఉందన్నారు.
పాలేరు ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉందన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేశాడని అన్నారు. వేల కోట్ల కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ద్రోహి ఎమ్మెల్యే కందాల అని ధ్వజమెత్తారు. పాలేరు నియోజకవర్గంలో పేదల భూములు ఎలా కబ్జా చేస్తారని ఆయన ప్రశ్నించారు. నాగార్జునసాగర్ కాలువలపై ఉన్న మట్టిని ఎలా అమ్ముతారు? అని నిలదీశారు.
Also Read.. Padi Kaushik Reddy: ఛీటర్ రాజేందర్.. సింగిల్ గా వస్తా.. చర్చకు సిద్ధమా?: కౌశిక్ రెడ్డి
పాలేరు కాంగ్రెస్ కంచుకోట అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క కోరారు. తెలంగాణ సమాజం ఏకం చేద్దాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది-మాణిక్ రావు ఠాక్రే
మరోవైపు ఖమ్మంలో పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాక్రే మీడియాతో మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి జూలై 2న కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు. అదే రోజున ఖమ్మంలో 2లక్షల మందితో భారీ సభ ఉంటుందన్నారు. కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు కూడా అదే రోజు ఉంటుందన్నారు. పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన భట్టిని ఆ సభలో రాహుల్ గాంధీ ఘనంగా సత్కరిస్తారని ఠాక్రే వెల్లడించారు. కాంగ్రెస్ ని వీడిన వారు తిరిగి ఘర్ వాపస్ వస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందంగా ఉన్నారని ఠాక్రే చెప్పారు. కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతామని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.