Hyderabad : భారీ పిడుగు నుంచి తప్పించుకున్న వ్యక్తి .. భూమి మీద నూకలు ఉండటం అంటే ఇదే..

తెలంగాణ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి అత్తాపూర్‌లో భారీ పిడుగు పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Hyderabad : భారీ పిడుగు నుంచి తప్పించుకున్న వ్యక్తి .. భూమి మీద నూకలు ఉండటం అంటే ఇదే..

hyderabad

Updated On : July 25, 2023 / 1:49 PM IST

Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Telangana Rain Alert : తెలంగాణకు రెడ్ అలర్ట్.. రెండు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. చెరువులను తలపిస్తున్న రోడ్లు, భారీ ట్రాఫిక్ జామ్‌లతో భాగ్య నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్తాపూర్‌లో ఖాళీగా కనిపించిన ఓ వీధిలో భారీ పిడుగుపడింది. అదృష్టవశాత్తూ ఓ వ్యక్తి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Weather update: తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు.. ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది?

భారీ వర్షాల్లో జనం బయటకు రావద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు, ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు రోడ్లపై మ్యాన్స్ హోల్స్ తెరిచి ఉన్నా.. విద్యుత్ వైర్లు తెగిపడి ఉన్నా జాగ్రత్తగా వెళ్లాలని పలుమార్లు హెచ్చరిస్తున్నారు.