Malla Reddy Dance: మనవరాలి సంగీత్ వేడుకలో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ చూశారా.. వీడియో వైరల్
సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

Malla Reddy Dance Video
Malla Reddy Dance: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా సందడి వాతావరణం ఉంటుంది. ఆయనకు కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా.. అసెంబ్లీలో మాట్లాడినా ఆయన స్టైలే వేరు. అలాంటి వ్యక్తి మాస్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూశారా..! తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మనవరాలి సంగీత్ ఫంక్షన్ లో తనదైన శైలిలో బ్రేక్ డ్యాన్స్ చేశారు మల్లారెడ్డి. 75ఏళ్ల వయస్సులో ఆయన వేసిన స్టెప్పులు చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్య పోతున్నారు.
మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈనెల 27వ తేదీన జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. డీజే టిల్లు సినిమాలోని పాటకు మనవళ్లతో కలిసి మల్లారెడ్డి డ్యాన్స్ చేశాడు. మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. మల్లారెడ్డి డ్యాన్స్ వీడియోను చూసిన నెటిజన్లు మల్లారెడ్డితో అట్లుంటది మరి.. అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.