Bhatti Vikramarka: కేసీఆర్ గ్లోబెల్ ప్రచారానికి తెరలేపారు.. కేటీఆర్, హారీశ్ రావు, కవితనేమో..: భట్టి విక్రమార్క

కాంగ్రెస్‌తో కలిసి వచ్చే భావ సారూప్యత కలిగిన వారితో చర్చలు జరుపుతామన్నారు. బీఎస్పీతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు.

Bhatti Vikramarka: కేసీఆర్ గ్లోబెల్ ప్రచారానికి తెరలేపారు.. కేటీఆర్, హారీశ్ రావు, కవితనేమో..: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Bhatti Vikramarka: బీఆర్ఎస్‌పై సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిరలో భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీ కార్డులోని పథకాలను తప్పకుండా అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ గ్లోబెల్ ప్రచారానికి తెరలేపారని, మంత్రులు కేటీఆర్, హారీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ అమలు చేస్తామని అన్నారు. తెలంగాణలో ఇళ్లులేని వారికి రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. వంట గ్యాస్ సిలెండరును రూ.500కే ఇస్తామని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తామని తెలిపారు. తాము అనేక సంవత్సరాల అనుభవం, బడ్జెట్ పై ఉన్న అనుభవంతో ఈ గ్యారంటీలు ఇస్తున్నామని చెప్పారు.

తాము ఇస్తామన్న గ్యారంటీ కార్డులపై బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని అన్నారు. దాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న సమయంలో ప్రభుత్వం ఇప్పుడు పథకాలు ప్రారంభిస్తోందని అన్నారు. ప్రజల మీద కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలను నమ్మెద్దని చెప్పారు.

సీఎం కేసీఆర్ పాలనను ఫామ్ హౌస్ లోనే ఉంటారని, సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వస్తారని అన్నారు. కాంగ్రెస్‌తో కలిసి వచ్చే భావ సారూప్యత కలిగిన వారితో చర్చలు జరుపుతామన్నారు. బీఎస్పీతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు.

Nara Lokesh: ఇక సమయం ఆసన్నమైంది.. శనివారం రాత్రి అందరం కలిసి మోత మోగిద్దాం: లోకేశ్, బ్రాహ్మణి పిలుపు