PremSagar Rao: నా నియోజకవర్గానికి నేనే బాస్, అన్యాయం జరిగితే సహించను- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
వేరే నియోజకవర్గం నేతలు వచ్చి పని చేస్తా అంటే ఉరుకోను. నాకు న్యాయం చేస్తుందని అధిష్టానంపై నమ్మకం ఉంది.

PremSagar Rao: క్యాబినెట్ విస్తరణపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అధిష్టానం సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. నా నియోజకవర్గానికి నేనే బాస్, ఇక్కడ ఎవరి ఎత్తులు చెల్లవని ఆయన తేల్చి చెప్పారు. నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారాయన. అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. నా బాస్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మాట్లాడారు.
Also Read: విస్తరణ సరే.. శాఖల కేటాయింపు ఎప్పుడు? సీఎం మదిలో ఏముంది?
”నేనున్నంత కాలం నా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాదే. నా నియోజకవర్గంలో పెత్తనం చెలాయించాలని ఏ నాయకుడు వచ్చినా ఊరుకునేది లేదు. నేను చెప్పినట్టు వినే అధికారులు మాత్రమే నా నియోజకవర్గంలో ఉంటారు. పార్టీకి దిక్కు లేని నాడు సపోర్ట్ గా లక్షలాది మందితో ముందుకు సాగాను. ఒక్క మంత్రిపదవి రాకుంటే నాకు ఒరిగిందేమీ లేదు. నా నియోజకవర్గంలో సీఎం తర్వాత నేనే బాస్. వేరే నియోజకవర్గం నేతలు వచ్చి పని చేస్తా అంటే ఉరుకోను. నాకు న్యాయం చేస్తుందని అధిష్టానంపై నమ్మకం ఉంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసులు బుక్ చేసినా 25 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నా” అని ప్రేమ్ సాగర్ రావ్ అన్నారు.