YS Sharmila : ఆ భయంతోనే దొరకు మళ్లీ అమరవీరులు యాదికొచ్చారు- సీఎం కేసీఆర్‌పై షర్మిల ఘాటు విమర్శలు

YS Sharmila : ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు.. అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేళ్లు పట్టింది.

YS Sharmila : ఆ భయంతోనే దొరకు మళ్లీ అమరవీరులు యాదికొచ్చారు- సీఎం కేసీఆర్‌పై షర్మిల ఘాటు విమర్శలు

YS Sharmila (Photo : Twitter)

Updated On : June 22, 2023 / 7:44 PM IST

YS Sharmila – CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా మరోసారి తీవ్ర విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అమరుల ప్రాణ త్యాగం – దొరకు దక్కిన అధికార వైభోగం అంటూ విమర్శించారు షర్మిల. సీఎం కేసీఆర్ టార్గెట్ గా మరో ట్వీట్ చేశారు షర్మిల.

”రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో అయితే.. ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్. అసువులు బాసిన అమరుల ఆశయాలు గోదారి పాలైతే.. స్వరాష్ట్ర సంపద అంతా కేసీఆర్ పాలయ్యే. నిధులు మింగే, నీళ్ళు ఎత్తుకు పోయే, ఉద్యోగాలు ఇంట్లనే ఇచ్చుకునే.

Also Read..Banswada Constituency: బాన్సువాడలో ప్రచారంలోకి దిగిపోయిన పోచారం.. ఆ సెంటిమెంట్ నుంచి గట్టెక్కుతారా?

త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర. అమరుల కుటుంబాలను ఆదమరిచిండు. ఇన్నాళ్లు వాళ్ళెవరో అన్నట్లు, గుర్తుకు లేనట్లు నాటకాలు ఆడిండు. ఉన్నట్లుండి 9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేల మళ్లీ పుట్టుకొచ్చే. అమరుల ప్రాణత్యాగం వెలకట్టలేనిది అంటూ కుండపోతగా ప్రేమను కురిపించే పన్నాగం పన్నుతున్నడు. ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే అమరవీరులు మళ్ళీ యాదికొచ్చారు.

రాష్ట్ర సాధనకై 1500 మంది ప్రాణాలు కోల్పోతే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు ఇది. 1200 మంది అమరవీరులయ్యారని సొంత లెక్కలు బయటపెట్టిన కేసీఆర్. ఆదుకున్నది 528మందిని మాత్రమే. మిగిలిన 700 మంది అమరుల త్యాగాలను, చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేసిండు. ఇల్లు, ఉద్యోగం, భూమి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు కేసీఆర్.

Also Read..Revanth Reddy: అప్పట్లోగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది: రేవంత్ రెడ్డి

అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తనని చెప్పి.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే తప్ప వారి పేర్లు ఎక్కడా చెక్కలే. ఇన్నాళ్లు గుర్తుకు రాని శంకరమ్మకు పిలిచి MLC ఇస్తాడట. కొత్తగా అమరులకు న్యాయం చేస్తాడట. ఉద్యమాన్ని అణగదొక్కిన ఉద్యమద్రోహులను అక్కున చేర్చుకొని.. తెలంగాణ తల్లికి ఆత్మఘోష రగిల్చిన మారీచుడు ఈ కేసీఆర్. ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు.. అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేళ్లు పట్టింది. కేసీఆర్ లాంటి ఉద్యమద్రోహులు అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరించడం అంటే.. అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే ” అని ధ్వజమెత్తారు షర్మిల.