Padi Kaushik Reddy : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎందుకంటే..
మాసబ్ ట్యాంక్ ఇన్ స్పెక్టర్ ను ఈ కేసు దర్యాఫ్తు అధికారిగా నియమించారు పోలీసు ఉన్నతాధికారులు.

Kaushik Reddy
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, గురువారం కోర్టుకు వెళ్లాల్సి ఉందని, ఈ నెల 17న విచారణకు హాజరవుతానని పోలీసులకు కౌశిక్ రెడ్డి రిప్లయ్ ఇచ్చారు. బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ విధులను అడ్డుకోవడంతో పాటు బెదిరింపుల వ్యవహారంలో గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
ఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఇన్ స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. మాసబ్ ట్యాంక్ ఇన్ స్పెక్టర్ ను ఈ కేసు దర్యాఫ్తు అధికారిగా నియమించారు పోలీసు ఉన్నతాధికారులు.
పాడి కౌశిక్ రెడ్డి వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఏకంగా పోలీసులతోనే ఆయన వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. డ్యూటీలో ఉన్న ఇన్ స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదిరింపులకు గురిచేసిన కేసులో మరొకసారి హైదరాబాద్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.
ఇక కరీంనగర్ కలెక్టరేట్ ఘటనలోనూ పాడి కౌశిక్ రెడ్డిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కూడా కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
Also Read : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ దూకుడు.. ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా?