Nagarjunasagar: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత 

ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చారని డాక్టర్లతో చిన్నారుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు.

Nagarjunasagar: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత 

Updated On : November 15, 2025 / 11:10 AM IST

Nagarjunasagar: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్న పిల్లల వార్డులో రోజూలాగే చిన్నారులకు వైద్యులు ఇంజక్షన్లు ఇచ్చారు.

ఇంజక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ఐసీయూకి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. (Nagarjunasagar)

Also Read: తెలంగాణ టెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ షురూ

ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చారని డాక్టర్లతో శిశువుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. ఆ చిన్నారుల హెల్త్ కండీషన్‌పై తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.

ఆ చిన్నారులు అందరూ ఇటీవల వైరల్ ఫీవర్‌తో ఇటీవల ఆసుపత్రిలో చేరినవారే. ప్రస్తుతం ఆ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.